Home

»

Latest News

Balakrishna: బాలయ్య సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్!

Mar 31, 2026

 

-బాలయ్యతో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు
-మరి అలాంటిది ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా!
-అసలు ఆ వార్త ఎంత వరకు నిజం 
-సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఏంటి!


గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)తో జతకట్టడం వలన ఏ హీరోయిన్ కైనా ఉన్న బెనిఫిట్ ఏంటంటే తన పీఆర్ టీం చేత మాటిమాటికి పబ్లిసిటీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంతలా సదరు భామ బాలయ్య హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ తో మారుమూల పల్లెలో సైతం అభిమానులు, మూవీ లవర్స్ నోళ్ళల్లో నానుతూనే ఉంటుంది. బాక్స్ ఆఫీస్ బొనాంజాగా బాలకృష్ణ ఛార్జ్ తీసుకున్న దగ్గర్నుంచి దాదాపుగా బాలయ్యతో చేసిన ప్రతి హీరోయిన్ ది ఇదే పరిస్థితి. అలాంటిది ఒక హీరోయిన్ బాలయ్య సరసన  నో చెప్పినట్టుగా టాక్ ఒకటి సోషల్ మీడియాలో స్వతంత్ర హోదాలో కొనసాగుతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం.

తమన్నా(Tamannah).. సుదీర్ఘ కాలం నుంచి తనకంటు ఒక ఇమేజ్ ని సృష్టించుకొని దూసుకుపోతుంది. బాలయ్య ప్రెజెంట్ గోపీచంద్ మలినేని మూవీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. నయనతార దాదాపుగా బాలయ్యతో జత కడుతున్నట్టే. ఈ మేరకు  నయనతార నుంచి అనౌన్స్ మెంట్ రావాలంతే.  ఇక ఈ మూవీలో మొదట తమన్నాని హీరోయిన్ గా గోపిచంద్ అనుకున్నాడంట. బాలయ్యతో ఇప్పటి వరకు స్క్రీన్ షేర్ చేసుకోలేదు కాబట్టి అభిమానులు, ప్రేక్షకులకి కొత్త లుక్ తో కూడిన ఫ్రెష్ జంటని  చూసిన అనుభూతి ఉంటుందనునుకున్నా డంట, కానీ తమన్నా ఒప్పుకోలేదనే వార్తలు సోషల్ మీడియాతో పాటు సినీ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.


Also read: Peddi: లుక్ వెనక ఉన్న అసలు రహస్యం ఇదే.. ఈ ఫుడ్ తింటే మీకు కూడా పక్కా


అందరకి సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది కానీ నాకుంది ఒకటే ఇన్నింగ్స్ అంటు తమన్నా  చిన్న, పెద్ద హీరోలతో చేస్తూ దూసుకుపోతుంది. పైగా ఈ మధ్యన సోలో హీరోయిన్ గా సినిమాలు రాకపోయే సరికి స్పెషల్ సాంగ్స్ లోను చేస్తూ తన సత్తా చాటుతుంది. అలాంటిది బాలకృష్ణతో చెయ్యనని చెప్పే కారణం ఉండనే ఉండదు. ఆఫర్ రాగానే ఎగిరి గంతేస్తుంది కూడా. ఈ పచ్చి సినీ సత్యాలు తెలిసిన అభిమానులు నెట్టింట ఉన్న పళంగా కూర్చొని తమన్నా తన కంటే వయసులో పెద్ద వాళ్ళైన చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకుంటూ వస్తుంది. మరి వాళ్ళ సినీ అగ్రజుడు  బాలయ్య సరసన ఆఫర్ వస్తే తన ఇష్టదైవాన్ని కొలుచుకొని కాల్షీట్స్ పై సంతకం చేసి ఉండేదనే కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఇండస్ట్రీలో గత చరిష్మా గురించి డిస్కర్షన్ ఉండదు. ప్రస్తుతం ఏంటనేదే ముఖ్యం. ప్రేక్షకుల నాది కూడా ఇదే. కాబట్టి బాలయ్య పక్కన ఛాన్స్ వదులుకునేంత సినీ తెలివితక్కువ తనం తమన్నాకి లేదు. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com