పదహారేళ్ళ ప్రాయంలో `బన్ని`
on Apr 6, 2021

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `బన్ని` ఒకటి. `గంగోత్రి`, `ఆర్య` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తరువాత వచ్చిన `బన్ని`తో హ్యాట్రిక్ అందుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు అల్లు అర్జున్. స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కాంబినేషన్ లో బన్ని చేసిన తొలి చిత్రమిదే కావడం విశేషం. అల్లు అర్జున్ కి జోడీగా గౌరి ముంజల్ నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, సీత, సుధ, శరత్ సక్సేనా, ముఖేష్ రిషి, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, వేణు మాధవ్, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, రాజన్ పి. దేవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. `బన్ని` టైటిల్ సాంగ్ అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే.. `జాబిలమ్మవో`, `వా వా వారెవా`, `మయిలు మయిలు`, `మారో మారో` గీతాలు కూడా అలరించాయి. ఎం. సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా.. 2005 ఏప్రిల్ 6న జనం ముందుకు వచ్చింది. నేటితో `బన్ని` 16 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



