ఆల్కహాల్ లో మునిగి తేలుతున్న అల్లరి నరేష్!
on Jun 30, 2025
అప్పట్లో కామెడీ హీరోగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అల్లరి నరేష్.. కొన్నేళ్లుగా విభిన్న చిత్రాలు చేస్తూ నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో వైవిధ్యభరితమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. (Allari Naresh)
అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని 'ఫ్యామిలీ డ్రామా' ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నేడు(జూన్ 30) నరేష్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. (Alcohol First Look)
నరేష్ కొత్త చిత్రానికి 'ఆల్కహాల్' అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో ఆల్కహాల్ లో మునిగి తేలుతున్నట్టుగా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు. టైటిల్ లో ఆల్కహాల్, పోస్టర్ లో ఆల్కహాల్ చూస్తుంటే.. సినిమాలో ఆల్కహాల్ ను ముడిపెడుతూ ఏదో కొత్త కథ చెప్పబోతున్నారని అర్థమవుతోంది. మరి ఇందులో నరేష్ ఎలా కనిపిస్తాడో చూడాలి.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రుహాని శర్మ హీరోయిన్. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా జిజు సన్నీ, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
