ENGLISH | TELUGU  

‘పుష్ప2’.. గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం!

on Nov 1, 2023

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి నేషనల్‌ అవార్డులు కూడా రావడంతో ఇప్పుడు ‘పుష్ప2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు సుకుమార్‌. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి కొన్ని భారీ షెడ్యూల్స్‌ జరిగాయి. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న ఈ చిత్రం విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ కోసం ఎక్కువ సమయం తీసుకుంటుండడం వల్ల డిలే అవుతోంది. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్‌ పూర్తయింది. 

తాజా సమాచారం మేరకు నవంబర్‌ 2 నుంచి ‘పుష్ప2’ భారీ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్లో పెద్ద జాతర ఫైట్‌ ప్లాన్‌ చేస్తున్నారట సుకుమార్‌.  ఈ ఫైట్‌ ముందు వచ్చే సీన్స్‌ని కూడా చిత్రీకరిస్తారట. అలాగే ఒక పాటను కూడా ఈ షెడ్యూల్‌లోనే షూట్‌ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా మొత్తానికి ఇదే భారీ షెడ్యూల్‌ అని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో అల్లు అర్జున్‌ తిరుపతి గంగమ్మ జాతరకి సంబంధించిన వేషంలో కనిపించి మెప్పించారు. కాగా ఇప్పుడు జాతర ఫైట్‌ అనడంతో అల్లు అర్జున్‌ ఈ ఫైట్‌ కోసం అదే గెటప్‌లో కనిపించొచ్చు అనుకుంటున్నారు. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ పెళ్ళిలో ఉన్న బన్ని ఈరోజు రాత్రికి హైదరాబాద్‌ చేరుకుంటారని, రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.