'అలిమేలు మంగ...'గా కాజల్?
on May 23, 2020

అలిమేలు మంగ అనగానే ఏడుకొండల వెంకటేశ్వరుని సతీమణి అలిమేలు పై డివోషనల్ సినిమా తీస్తున్నారని అనుకోవద్దు. ఇది మోడ్రన్ జనరేషన్ సినిమాయే. గోపీచంద్ కథానాయకుడిగా దర్శకుడు తేజ 'అలివేలు మంగ వెంకటరమణ' సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా, అనగా అలిమేలు మంగ పాత్రకు కాజల్ అగర్వాల్ ను సంప్రదించాలని తేజ అనుకుంటున్నారట.
దర్శకుడు తేజ లాస్ట్ సినిమా 'సీత'లో కాజల్ కథానాయికగా నటించారు. ఆమెను 'లక్ష్మీకళ్యాణం' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా పరిచయం చేసింది కూడా తేజానే. అయితే ఇప్పటివరకు గోపీచంద్ సరసన కాజల్ సినిమా చేయలేదు. వాళ్ళిద్దరు జోడి ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని, అందుకనే కాజల్ ను సంప్రదించాలని తేజ అనుకుంటున్నారట. మరోవైపు రెమ్యూనరేషన్ ఎంత చెబుతుందోనని ఆలోచిస్తున్నారట. కరోనా నేపథ్యంలో చాలా మంది తమ రెమ్యునరేషన్ తగ్గిస్తున్నారు. కాజల్ తగ్గిస్తుందా లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



