ఆలియా.. `పిరియడ్` టచ్!
on Feb 21, 2022

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చి పదేళ్ళు కావస్తోంది. ఈ ప్రయాణంలో అటు గ్లామర్ తోనూ, ఇటు పెర్ఫార్మెన్స్ తోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుందీ టాలెంటెడ్ యాక్ట్రస్. అలాగే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది కూడా.
ఇదిలా ఉంటే, నాలుగు వారాల వ్యవధిలో రెండు ఆసక్తికరమైన చిత్రాలతో సందడి చేయబోతోంది ఆలియా. ఆ సినిమాలే.. `గంగూబాయి కథియావాడి`, `ఆర్ ఆర్ ఆర్`. ఈ నెల 25న `గంగూబాయి` విడుదల కానుండగా.. వచ్చే నెల 25న `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కాబోతోంది. కాగా, దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఎంటర్టైన్ చేయనున్న ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. అదేమిటంటే.. ఈ రెండు కూడా పిరియడ్ డ్రామాలనే. 1950ల కాలం నాటి కథాంశంతో బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామాగా `గంగూబాయి` తెరకెక్కగా.. 1920ల కాలం నాటి స్టోరీతో ఫిక్షనల్ డ్రామాగా `ఆర్ ఆర్ ఆర్` రూపొందింది. మరి.. ఈ పిరియడ్ టచ్ సబ్జెక్ట్స్ ఆలియా కెరీర్ కి ఏ మేరకు ప్లస్సవుతాయో చూడాలి.
`గంగూబాయి కథియావాడి`కి బాలీవుడ్ స్టార్ కెప్టెన్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించగా.. `ఆర్ ఆర్ ఆర్`ని దర్శకధీరుడు రాజమౌళి తీర్చిదిద్దారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



