అక్కినేని అంతర్జాతీయ అవార్డుల ప్రదానం
on Dec 20, 2015

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఎఫ్.ఎన్.సి.సి.లో ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. అక్కినేని ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నవరత్నాలు పేరుతో వివిధ రంగాల్లో విశేషసేవలు అందించిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు... కుమార్తె నాగ సుశీల, మనవళ్ళు సుమంత్, సుశాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అలనాటి నిర్మాత కృష్ణవేణి, నటి జమున, విద్యావేత్త రామయ్య, వ్యాపారవేత్త ఏవీఆర్ చౌదరి, రంగస్థల నటుడు కర్నాటి లక్ష్మీ నరసయ్య, వైద్యుడు డాక్టర్ గుల్లా ప్రకాష్, సమాజ సేవకుడు డాక్టర్ సునీత కృష్ణన్, చేనేత కళాకారుడు నల్లా విజయ్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణా మలావత్‌లకు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను అందజేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



