రెండు వారాల వ్యవధిలో `అక్కినేని బద్రర్స్`!
on Sep 15, 2021
రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు అక్కినేని కాంపౌండ్. ఆ కుటుంబంలో మొదటి తరం కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు ఈ తరహా చిత్రాలకు బీజం వేస్తే.. రెండో తరం కథానాయకుడు నాగార్జున కూడా అదే బాటలో పయనించి పలు ఘనవిజయాలు అందుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు మూడో తరంలో నాగ్ తనయులు నాగచైతన్య, అఖిల్ కూడా అవకాశం దొరికినప్పుడల్లా అదే రూట్ లో వెళుతున్నారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అటు అఖిల్ - ఇటు చైతూ ఇద్దరు కూడా రెండు వారాల వ్యవధిలో కొత్త చిత్రాలతో పలకరించబోతున్నారు. అంతేకాదు.. ఆ రెండు సినిమాలు కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్స్ నే కావడం విశేషం. ఈ నెల 24న చైతూ నటించిన రొమాంటిక్ డ్రామా `లవ్ స్టోరి` విడుదల కానుండగా.. అక్టోబర్ 8న అఖిల్ యాక్ట్ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` రిలీజ్ కానుంది. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో అక్కినేని బ్రదర్స్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
కాగా `లవ్ స్టోరి`లో చైతూకి జంటగా సాయిపల్లవి నటించగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఇక `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విషయానికి వస్తే అఖిల్ కి జోడీగా పూజా హెగ్డే నటించగా భాస్కర్ డైరెక్ట్
చేశాడు.
Also Read