'లెహరాయీ' సాంగ్ వచ్చేసింది.. అఖిల్, పూజ కెమెస్ట్రీ అదిరింది!
on Sep 15, 2021
అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ పోషిస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీలోని 'లెహరాయీ' అనే లవ్ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ సాంగ్‌లో మనం అఖిల్, పూజ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో గ్రహించవచ్చు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
అదివరకు సెప్టెంబర్ 13న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నిర్మాతలు లెహరాయీ సాంగ్ ప్రోమోను ఆవిష్కరించి, పూర్తి పాటను సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. గోపి సుందర్ స్వరాలు కూర్చిన ఈ పాటను శ్రీమణి రాయగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. హర్ష (అఖిల్), విభ (పూజ) మధ్య ప్రేమ ఎలా మొదలై, వికసించిందో ఈ పాట ద్వారా మనకు తెలియజేశారు. సినిమా సెట్స్ మీద బిహైండ్ ద సీన్స్ (బీటీఎస్)ను కూడా ఈ పాటలో చూపించారు. అఖిల్, పూజ మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా వర్కవుట్ అయినట్లు ఈ పాట మనకు చూపిస్తోంది.
ఈ పాటను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన పూజ, “Come fall in love with the romantic & breezy melody #Leharaayi from #MostEligibleBachelor (sic).” అని రాసుకొచ్చింది.
హర్ష అనే ఎన్నారై యువకుడు, విభ అనే స్టాండప్ కమెడియన్ మధ్య లవ్ స్టోరీతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'ను బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించాడు. ఈషా రెబ్బ, ఆమని, మురళీశర్మ, వెన్నెల కిశోర్, జయప్రకాశ్, ప్రగతి కీలక పాత్రధారులైన ఈ మూవీని బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలవుతోంది.