Home

»

Latest News

రెండు సార్లు `నంది` `బెస్ట్ యాక్ట‌ర్`గా రెబ‌ల్ స్టార్ - కామ‌న్ పాయింట్స్ అవే!

Jan 20, 2022 12:10PM

(జ‌న‌వ‌రి 20 రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా..)

తెలుగునాట తిరుగులేని స్టార్ డ‌మ్ సొంతం చేసుకున్న క‌థానాయ‌కుల్లో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఒక‌రు. ప‌లు వైవిధ్య‌భ‌రితమైన‌ పాత్ర‌లు పోషించి టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారీ సీనియ‌ర్ స్టార్. అలాగే త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ప‌లు అవార్డుల‌ను కూడా కైవ‌సం చేసుకున్నారు. మ‌రీముఖ్యంగా.. తెలుగువారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే `నంది` పుర‌స్కారాల‌ను `ఉత్త‌మ న‌టుడు` విభాగంలో రెండు ప‌ర్యాయాలు అందుకున్నారు కృష్ణంరాజు. అంతేకాదు.. `బెస్ట్ యాక్ట‌ర్` విభాగంలో తొలి `నంది`ని అందుకున్న క‌థానాయ‌కుడు కృష్ణంరాజునే కావ‌డం విశేషం. 1977లో విడుద‌లై జ‌న‌నీరాజ‌నాలు అందుకున్న `అమ‌ర దీపం`తో ఈ ఘ‌న‌త‌ను సాధించారాయ‌న‌.

ఆపై 1984లో విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన `బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌`తో మ‌రోమారు `నంది` ఉత్త‌మ న‌టుడిగా నిలిచారు కృష్ణంరాజు. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. `అమ‌ర దీపం`, `బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌`.. ఇలా కృష్ణంరాజుకి `బెస్ట్ యాక్ట‌ర్`గా `నంది` పుర‌స్కారాలు అందించిన రెండు సినిమాల‌ను కూడా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్ర‌రావు రూపొందించగా, కృష్ణంరాజు సోద‌రుడు ఉప్ప‌ల‌పాటి సూర్య‌నారాయ‌ణ రాజు (యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తండ్రి) నిర్మించారు. అంతేకాదు.. ఈ రెండు సినిమాల‌తోనూ `ఉత్త‌మ న‌టుడు`గా అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకున్నారు కృష్ణంరాజు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com