అఖండ 2 కోసం వేణుస్వామి పూజలు చేశాడా! ఫ్యాన్స్ ఆగ్రహం
on Dec 5, 2025
.webp)
-వేణు స్వామి పూజలు చేశాడా!
-ఆ వీడియోలో ఏముంది
-ఫ్యాన్స్ ఆగ్రహం
రెండు రోజుల క్రితం వేణుస్వామి(Venu swamy)సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసాడు. సదరు వీడియోలో వేణుస్వామి(Venu Swamy)హోమం చేస్తూ వీక్షకులని ఉద్దేశించి మాట్లాడుతు త్వరలోనే స్టార్ హీరో, స్టార్ దర్శకుడు, స్టార్ ప్రొడ్యూసర్ సినిమా విడుదల కాబోతుంది.ఆ సినిమా ఘన విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అఖండ 2 రిలీజ్ కి సిద్ధంగా ఉండటంతో వేణు స్వామి చెప్పింది సదరు చిత్రం గురించే అని అభిమానులు భావించారు.
ఇక ఎవరు ఊహించని విధంగా నిన్న ప్రీమియర్స్ నుంచి అఖండ 2 థియేటర్స్ లో అడుగుపెట్టకపోవడంతో బాలయ్య అభిమానులు కొంత మంది వేణుస్వామిపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'నిన్ను ఎవడు పూజలు చేయమన్నాడు. ఆ పూజల కారణంగానే మూవీ విడుదల వాయిదా పడింది. పూజలు చేస్తే రిలీజ్ అవుతుందని ఎలా అనుకున్నావు అంటూ మండిపడుతున్నారు
.
also read: akhanda 2: ఈ రోజు ఈవినింగ్ షోస్ నుంచి బుకింగ్స్ ఓపెన్
ఇక ఏపి లోని వైజాగ్, విజయవాడ లాంటి చోట్ల బుక్ మై షో టికెట్స్ ని అందుబాటులో ఉంచింది. మిగతా ఏరియాల్లో ఇంకా ఓపెన్ కాలేదు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ ఏరియా బుకింగ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. సదరు బుకింగ్స్ ఓపెన్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



