అఖండ 2 షూటింగ్ ఎన్టీఆర్ జిల్లాలో జరిగేది అక్కడే
on Jan 20, 2025
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna)ప్రస్తుతం'డాకు మహారాజ్'(Daku Maharaj)సక్సెస్ జోష్ లో ఉన్నాడు.జనవరి 11 న వచ్చిన ఈ మూవీ ఇప్పటికే 156 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించగా చాలా ఏరియాల్లో ఇంకా స్ట్రాంగ్ రన్ ని చవిచూస్తుంది.చిత్ర బృందం కూడా ఇటీవల సక్సెస్ మీట్ ని నిర్వహించి అభిమానుల్లో ఆనందోత్సవాలని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య అఖండ పార్ట్ 2 తో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.
బోయపాటి శ్రీను(Boyapati srinu)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 'అఖండ'(Akhanda)కి సీక్వెల్ గా తెరకెక్కుతుండంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఎన్టీఆర్(Ntr)జిల్లాలో జరపడానికి బోయపాటి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈ మేరకు ఆయన రీసెంట్ గా ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజక వర్గం చందర్లపాడు మండలం గుడిమెట్ట గ్రామం వద్ద కృష్ణానది తీరప్రాంతాన్ని పరిశీలించాడు.ఆ ఏరియా షూట్ కి అనువుగా ఉంటుందా లేదా అని స్థానికులతో కూడా మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకున్నారు.ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
కొన్ని రోజుల క్రితం ప్రస్తుతం 'మహాకుంభమేళ' జరుగుతున్న ఉత్తరప్రదేశ్ లో మూవీ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరించారు.ఇక ఈ మూవీని 14 రీల్స్ పతాకంపై ఆచంట రామ్(Achanta ram)గోపినాధ్(Achanta Gopinadh)తో కలిసి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని(Nandamuri Tejaswini)నిర్మిస్తుండగా దాదాపుగా అఖండ క్యాస్ట్ నే ఇందులోని కనపడనుంది.దసరా కానుకగా సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా మరోసారి తమన్(Thaman)తన సంగీతంతో అఖండ 2 తో థియేటర్స్ లో శివ స్తుతులతో పూనకాలు తెప్పించబోతున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
