అజిత్... మండు వేసవిలో మొదలుపెడతారా?
on Mar 29, 2023
తమిళ ఇండస్ట్రీ తల అజిత్. అంతా అనుకున్నట్టే జరిగి ఉంటే ఈ దీపావళికి ఆయన సినిమా విడుదల కావాల్సింది. ఈ ఏడాది సంక్రాంతికి తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అజిత్. అదే సీజన్లో వారసుడు సినిమాతో అభిమానులను పలకరించారు విజయ్. వీరిద్దరూ మళ్లీ దీపావళి సీజన్లో పోటీపడటం ఖాయం అని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తునివు తర్వాత వరల్డ్ టూర్ వెళ్లారు అజిత్. భార్యాపిల్లలతో వెకేషన్‌కి వెళ్లారు. నయనతార భర్త విఘ్నేష్ శివన్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా కేన్సిల్ అయింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదన్నది కోలీవుడ్ న్యూస్.
అంతలోనే మగిళ్ తిరుమేని అనే డైరక్టర్ చెప్పిన కథ నచ్చిందని అన్నారు.
అయితే పాయింట్‌గా దానికి ఓకే చెప్పిన అజిత్, నెరేషన్ విషయంలో మాత్రం నో చెప్పారట. అందుకే సరికొత్త సీన్లు రాసుకోవడానికి మగిళ్ తిరుమేనికి టైమ్ పట్టింది. ఇంతలో అజిత్ తండ్రి సుబ్రమణ్యం కన్నుమూశారు. అజిత్ ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయింది. కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు అందరూ అజిత్‌కి సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అజిత్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. ముందు అనుకున్న ప్రకారమైతే ఏకే 62 సినిమా ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్‌కి ముహూర్తం జరుపుకోవాలి. కానీ, ఇప్పుడు అజిత్ తండ్రి మరణించడంతో ఈ సినిమా ఓపెనింగ్ వాయిదా పడింది. మేలో ఈ సినిమాకు సంబంధించి కంటిన్యూస్ షెడ్యూల్ పెట్టుకుందామని అన్నారట అజిత్. లైకా ప్రొడక్షన్స్ సీఈఓ జీకేఎం తమిళ్ కుమరన్ ఈ విషయం గురించి హింట్ ఇచ్చారు. అజిత్ కుమార్ తండ్రి మరణానంతరంవాళ్ల ఇంటికి వెళ్లారు తమిళ్ కుమరన్.
అక్కడ మీడియాతో మాట్లాడుతూ అజిత్ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు. ఆల్రెడీ ఫిబ్రవరిలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఏకే62 పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. మగిళ్ తిరుమేని ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీగా ఉన్నారు. సంతోష్ నారాయణన్ ట్యూన్లు కడుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
