
ప్రేమ.. కేవలం రెండంటే రెండు అక్షరాలతో ఉండే సంజీవిని. కాకపోతే ప్రేమ దక్కాలంటే కొన్ని యుగాలు అయినా వెయిట్ చెయ్యాల్సిందే. వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇందుకు సినిమా హీరోయిన్ అతీతురాలేం కాదు. కాబట్టే వెయిట్ చేసింది. పదేళ్ల తన ప్రేమని దక్కించుకొని సరికొత్త లోకంలో, వాయువులో విహరిస్తూ ఉంది.
దక్షిణాది చిత్రసీమలో తనదైన నటన, సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి, ప్రముఖ యూట్యూబర్ అహాత్నా కృష్ణ (Ahaana Krishna) ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి (Nimish Ravi)ని మొన్న సెప్టెంబర్ 13న కేరళలోని కోవలం వేదికగా వివాహ మాడింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను నటి అధికారికంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందంలో మునిగిపోయారు.
తన వివాహ ఫోటోలని షేర్ చేస్తూ అహాత్నా రాసుకొచ్చిన క్యాప్షన్ ప్రతి ఒక్కరి హృదయాలని తాకుతోంది. "20 ఏళ్ల వయస్సులో నిన్ను కలుసుకున్నాను, 30 ఏళ్ల వయస్సులో నిన్ను పెళ్లి చేసుకున్నాను" అంటూ నిమిష్ పట్ల తనకున్న ప్రేమని చాటుకున్నారు. 2014లో 'న్జాన్ స్టీవ్ లోపెజ్' సినిమా సెట్‌లో వీరిద్దరి పరిచయం మొదలైంది. ఆ చిత్రంలో అహాత్నా కథానాయికగా నటించగా, నిమిష్ అసిస్టెంట్ కెమెరామెన్‌గా విధులు నిర్వహించారు. అక్కడ చిగురించిన ఆ స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారింది. నిమిష్‌ను తన బెస్ట్ ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్, సోల్‌మేట్ మరియు ఇప్పుడు భర్తగా అభివర్ణిస్తూ, తన కలల వివాహాన్ని నిజం చేసుకున్నానని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తిరువనంతపురంలోని తాజ్ కోవలం రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో అహాత్నా ఎరుపు రంగు కాంజీవరం పట్టు చీరలో, సాంప్రదాయ స్వర్ణాభరణాలతో మెరిసిపోగా, నిమిష్ రవి క్రీమ్ కలర్ డ్రెస్‌తో ఎంతో హుందాగా కనిపించారు. ఈ వేడుకకి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దాదాపు 6 నెలల పాటు కష్టపడి తన డ్రీమ్ వెడ్డింగ్ ఆర్గనైజ్ చేసిన ప్రణాళికా బృందానికి కూడా అహాత్నా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సుబ్రమణ్యం హాల్‌లోని త్రివేండ్రం క్లబ్‌లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు.

Also Read: పూర్ణ ఎమోషనల్ పోస్ట్: చిన్న వయసులోనే పాప మృతి
ఈ రిసెప్షన్ వేడుకకి సినీ పరిశ్రమలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాంతార ఫేమ్ నటుడు రిషబ్ శెట్టి దంపతులు ప్రత్యేకంగా తిరువనంతపురం వచ్చి శ్రీపద్మనాభస్వామి వారిని దర్శించుకుని అనంతరం ఈ నూతన దంపతులను ఆశీర్వదించారు. కెరీర్ పరంగా నిమిష్ రవి 'లూకా', 'కురుప్', 'రొమాంచమ్' వంటి సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించి తన ప్రతిభను చాటుకున్నారు. రాబోయే ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ 'జై హనుమాన్' చిత్రానికి కూడా ఆయనే డిఓపిగా పని చేస్తున్నారు. మరోవైపు అహాత్నా కూడా నటిగా రాణిస్తుంది.
[Ahaana Krishna, Nimish Ravi, Ahaana Krishna And Nimish Ravi Wedding, 10years Love, Mollywood Resent News, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





