
ఇటీవల హిందీలో దేశవ్యాప్తంగా రిలీజ్ అయి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘హనుమాన్ అంశ్’ మూవీ తెలుగు వెర్షన్ విడుదలపై ఇప్పుడు ఊహించని సందిగ్ధత నెలకొంది.
ఈ సినిమాను సెప్టెంబర్ 18న ఘనంగా తెలుగులో విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాదు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు విడుదల బాధ్యతను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. త్రివిక్రమ్ కి చెందిన ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ ద్వారా విడుదల కానున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ, ఇప్పుడు ఈ మూవీ తెలుగు రిలీజ్ పై సస్పెన్స్ నెలకొంది.
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా జరగాల్సిన తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. అసలు ఈ టీజర్ లాంచ్ సడెన్‌గా ఎందుకు ఆగిపోయింది? ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం.. కొన్ని అనివార్య కారణాల వల్ల త్రివిక్రమ్ ఈ సినిమా బాధ్యతల నుంచి తప్పుకున్నారని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ వైదొలగడం వల్లే ఈ సినిమా తెలుగు రిలీజ్ వాయిదా పడుతోందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'హనుమాన్ అంశ' ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించింది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అంతటి గొప్ప డివోషనల్ మూవీని తెలుగులో సెప్టెంబర్ 18న చూడబోతున్నామని ఎగ్జైట్ అయిన ఫ్యాన్స్‌కి ఈ వాయిదా న్యూస్ నిజంగా పెద్ద షాకే అని చెప్పాలి.
త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారంపై గానీ, ఈ సినిమా తెలుగు విడుదల తేదీ మార్పుపై గానీ.. చిత్ర యూనిట్ లేదా త్రివిక్రమ్ టీమ్ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[Hanuman Ansh Telugu Release, Hanuman Ansh Postponed, Hanuman Ansh Box Office, Neem Karoli Baba, Trivikram Srinivas, Vishal Chaturvedi, Telugu Film News, Telugu News]





