
సీనియర్ నటి, ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ పూర్ణ శోకసంద్రంలో మునిగిపోయారు. తాజాగా ఆమె నడుపుతున్న డ్యాన్స్ అకాడమీకి చెందిన ఒక చిన్నారి విద్యార్థిని అకస్మాత్తుగా కన్నుమూయడం పూర్ణని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పసి వయసులోనే ఆ పాప లోకాన్ని విడిచివెళ్లడం తట్టుకోలేక పూర్ణ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకుంది.
'కొన్ని వీడ్కోళులు మాటలకు అందవు. ఎంతలా కన్నీళ్లు పెట్టుకున్నా నా గుండెల్లోని బాధ తొలగి పోవడం లేదు. చిన్నారి అమాయకమైన చిరునవ్వు, డాన్స్ నేర్చుకునే సమయంలో వేసిన చిన్ని చిన్ని అడుగులు స్టూడియోలోని ప్రతి మూలలో ఎప్పటికీ జ్ఞాపకాలుగా నిలిచిపోతాయ్. ఈమె నా స్టూడెంట్ మాత్రమే కాదు. నా కుటుంబంలో ఒకరిగా భావించా. నా డ్యాన్స్ స్టూడియో ఉన్నంతకాలం ఈ చిన్నారి మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, నీకు కన్నీటి నివాళి అర్పిస్తున్నాం’ అని నటి పూర్ణ రాసుకొచ్చింది. అయితే పాపకు ఏమైందో కచ్చితమైన కారణం చెప్పలేదీ నటి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
.webp)
Also Read: ధనుష్ 56 వ సినిమాకి ఊహించని టైటిల్: వివాదాస్పదం అవ్వదు కదా!
ఈ విషాద వార్త సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, బుల్లితెర నటులు మరియు డ్యాన్స్ ప్రేమికులు పూర్ణకు తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని, పాప తల్లిదండ్రులకి ఈ కష్టసమయంలో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు. కళాకారిణిగా ఎంతో మందికి స్పూర్తినిచ్చిన పూర్ణ ఈ విషాదం నుంచి త్వరితగతిన తేరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.హీరోయిన్‌గా, పలు ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా మెప్పించిన పూర్ణ, ప్రస్తుతం తన కుటుంబ జీవితంతో పాటు నృత్య కళారంగానికి సేవలు అందిస్తు వస్తుంది.
[Actress Poorna, Poorna Dance Student Passed Away, Poorna Emotional Instagram Post, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





