
సోషల్ మీడియాలో తనదైన మాటతీరు, కామెడీతో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.
‘అగ్గిపెట్టె మచ్చ’ అంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే చాలామందికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన యాస, డిఫరెంట్ మాటతీరు, హావభావాలతో కిరణ్ చేసిన వీడియోలు ఒకప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా ఆయన మాట్లాడే విధానం, ఒక్కో సందర్భంలో ఇచ్చే రియాక్షన్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ‘అగ్గిపెట్టె మచ్చ’ అనే పేరుతోనే కిరణ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా.. కిరణ్ పలు టీవీ కార్యక్రమాల్లో కూడా సందడి చేశారు. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి కార్యక్రమాల్లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. పలువురు యూట్యూబర్లు ఆయనతో ఇంటర్వ్యూలు చేసి తమ వీడియోల్లో ప్రత్యేకంగా చూపించేవారు.
అయితే కొంతకాలంగా కిరణ్‌కు సంబంధించిన కొత్త వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు. అసలు ‘అగ్గిపెట్టె మచ్చ’ ఏమయ్యారు? అంటూ అభిమానులు కూడా ఆరా తీస్తున్న సమయంలో.. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి.
అక్టోబర్ 5న కిరణ్‌ను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించినట్టు న్యూస్ వచ్చింది. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు కూడా సమాచారం బయటకు వచ్చింది.
కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ కిరణ్ తుదిశ్వాస విడిచారు.
ఇది కూడా చదవండి: బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల కాదు.. ఊహించని దర్శకుడితో చిరంజీవి మూవీ.!
[Aggipette Macha Is No More, Aggipette Macha Passed Away, Aggipette Macha Death, Aggipette Macha Kiran, Aggipette Macha, Telugu News]





