Home

»

Latest News

బాలయ్య 'దాదా' షూటింగ్ బ్రేక్: చాముండేశ్వరి ఆలయంలో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.!

Oct 7, 2026 7:05PM

హీరో మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనిక మంచు, కుమారుడు ధైరవ్, కుమార్తె దేవసేన శోభలతో కలిసి మైసూరులోని ప్రసిద్ధ చాముండి కొండలపై వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన మనోజ్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి శేషవస్త్రాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. మంచు మనోజ్ కుటుంబ సమేతంగా రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారిని పలకరించేందుకు ఆసక్తి చూపించారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం 'దాదా' షూటింగ్ ప్రస్తుతం మైసూరు పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మంచు మనోజ్, షూటింగ్ షెడ్యూల్ విరామంలో తన సతీమణి మౌనిక, పిల్లలతో కలిసి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్'కి జరిగిన ద్రోహం.. లేటుగా వెలుగులోకి.. రగిలిపోతున్న నిర్మాత.!

 

 

 

[RawKing Manoj Manchu, Bhuma Mounika Manchu, Sri Chamundeshwari Temple Mysuru, Nandamuri Balakrishna, Gopichand Malineni, Daada Movie, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com