రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత ఓటీటీలో!!
on Sep 14, 2023
.webp)
ఓటీటీ అనేది ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నప్పటికీ లాక్‌డౌన్ టైమ్‌లో దాని ప్రాధాన్యత అందరికీ తెలిసి వచ్చింది. దాంతో చాలామంది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసేసుకున్నారు. థియేటర్లలో సినిమా మిస్ అయితే ఎలాగూ ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే ధీమాతో ఉంటున్నారు. ఇటీవలికాలంలో సినిమా రిలీజ్ అయిన నెల నుంచి మూడు నెలలలోపు ఏదో ఒక ఓటీటీలో ప్రత్యక్షమవుతోంది. చిన్న హీరోల సినిమాలకైనా, పెద్ద హీరోల సినిమాలకైనా ఓటీటీ అనేది ఒక మహత్తర వరం.
సత్యరాజ్ కుమారుడు శిబి సత్యరాజ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘మయోన్’. ఈ సినిమాకి దర్శకుడు కిశోర్. గత ఏడాది జూన్ 24న తమిళ్‌లో, జూలై 7న తెలుగులో రిలీజ్ అయిందీ సినిమా. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసిందీ సినిమా
ఈ సినిమాలో శిబి సత్యరాజ్ ఆర్కియాలజిస్ట్‌గా నటించాడు. అతి పురాతన వస్తువులను మన సంస్కృతి, మన బాధ్యత అంటూ అందరికీ చెబుతుంటాడు హీరో. కానీ, అవే పురాతన విగ్రహాలను తన పై అధికారితో కలిసి స్మగ్గింగ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక విలువైన సమాచారం తెలుసుకుంటాడు. ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మయోన్ ఆలయం గురించి, అందులో వున్న నిధి గురించి తెలుసుకుంటాడు. ఎలాగైనా ఆ నిధిని సొంతం చేసుకోవాలనుకుంటాడు. అసలు మయో ఆలయం ఏమిటి? ఆ నిధి కోసం వెళ్ళిన వారికి ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి? పోలీసులు ఈ స్మగ్లర్స్‌ను పట్టుకోగలిగారా? అనేది కథ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



