'వార్-2'లో విలన్ ఎన్టీఆర్ కాదు!
on Apr 12, 2023

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న 'వార్-2'లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట ప్రభాస్, విజయ్ దేవరకొండను సంప్రదించారని, చివరికి ఎన్టీఆర్ కి ఈ అవకాశం దక్కిందని న్యూస్ వినిపించింది. అంతేకాదు 'వార్-2'లో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే దీనిలో వాస్తవం లేదని తెలుస్తోంది.
'వార్-2'లో హృతిక్ తో పాటు ముందు నుంచి ఎన్టీఆర్ పేరుని మాత్రమే పరిశీలిస్తున్నారట. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా స్పష్టం చేసింది. 'వార్-2' కోసం యశ్ రాజ్ ఫిలిమ్స్ ఎన్టీఆర్ తో ఐదారు నెలలుగా చర్చలు జరిపిందట. అసలు ఆ పాత్రను ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకునే డెవలప్ చేశారట. ముఖ్యంగా నిర్మాత ఆదిత్య చోప్రా ఆ పాత్రను ఎన్టీఆర్ తోనే చేయించాలని పట్టుబట్టారట. భారీ ప్రాజెక్ట్ కావడంతో పాటు, తన పాత్ర స్పై యూనివర్స్ లోని ప్రధాన పాత్రల్లో ఒకటి కావడంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక 'వార్-2'లో ఎన్టీఆర్ పాత్ర గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు స్పై యూనివర్స్ కే మెయిన్ విలన్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని, భవిష్యత్తులో వచ్చే భాగాల్లో మిగతా హీరోలు ఏకమై ఎన్టీఆర్ ని ఢీ కొడతారని ప్రచారం జరుగుతోంది. మరికొందరు మాత్రం 'వార్-2'లో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని అంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ కూడా రా ఏజెంట్ గా కనిపించనున్నాడని, విలన్ గా మరో స్టార్ నటిస్తాడని చెబుతున్నారు. హృతిక్, ఎన్టీఆర్ కలిసి 'వార్-2'లో విలన్ ని ఎదుర్కొంటారని.. ఈ యూనివర్స్ లో భాగంగా ఎన్టీఆర్ సోలో హీరోగా భవిష్యత్తులో మరో మూవీ రానుందని టాక్. మరి అసలు ఈ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



