శంకర్ పై కూతురు అదితి కీలక వ్యాఖ్యలు..మా నాన్న ఏం చెప్పడు
on May 13, 2025
ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్(Shankar)ఒకరు. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకేఒక్కడు, జీన్స్, అపరిచితుడు, రోబో వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం భారతీయుడు 3 కి సంబంధించిన పనుల్లో ఉన్నాడు. శంకర్ పెధ్ద కూతురు అదితి శంకర్(Aditi Shankar)2022 లో కార్తీ(Karti)హీరోగా తెరకెక్కిన 'విరుమాన్' తో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ తర్వాత మా వీరన్, నేసిప్పాయ వంటి చిత్రాల్లో నటించి మంచి నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది.సింగర్ గాను రాణిస్తు గేమ్ చేంజర్ తమిళ వెర్షన్ కి సంబంధించి 'ధోప్' సాంగ్ ని ఆలపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది.
అదితి ఇప్పుడు తెలుగులో భైరవం(Bhairavam)అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. సాయిశ్రీనివాస్(Sai Srinivas)మంచు మనోజ్(Manchu Manoj)నారా రోహిత్(Nara Rohit)హీరోలుగా చేస్తున్నారు. ఈ నెల 30 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అదితి మాట్లాడుతు శంకర్ కూతురు అనే గుర్తింపుని ఒక గౌరవంగా భావిస్తాను. కానీ ఆ గుర్తింపు నాపై ఒత్తిడి పెంచుతుందని భావించను. మా నాన్నకి నేను చేస్తున్న సినిమాల గురించి ఏమి తెలియదు. ఆయన సినిమాలతో ఆయన బిజీగా ఉంటారు. కాకపోతే నా సినిమాలని మాత్రం తప్పకుండా నాన్న చూడాల్సిందే. పట్టు బట్టి మరి చూపిస్తాను. నటిగా నా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి.
భైరవం గురించి చెప్పాల్సి వస్తే మనోజ్ నాకు ఎప్పట్నుంచో తెలుసు. తొలి రోజు సెట్ లోకి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే నేనే హీరోయిన్ అని చెప్పాను. పైగా మనోజ్, సాయి శ్రీనివాస్, రోహిత్ కి ముందు నుంచే తమిళం వచ్చు కాబట్టి షూటింగ్ లో నాకెలాంటి సమస్య రాలేదు. తెలుగు సినిమాల్లో నటించాలని ఎప్పట్నుంచో కోరిక. మా నాన్న తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్ చేసినా వెళ్లే దాన్ని. అలాంటిది నా సినిమా కోసం ఇక్కడకొచ్చి షూటింగ్ లో పాల్గొంటానని ఎప్పుడు అనుకోలేదని అదితి చెప్పుకొచ్చింది. క భైరవం మూవీనిసత్య సాయి ఆర్ట్స్ పై కె కె రాధామోహన్ నిర్మించగా విజయ్ కనక మేడల(VIjay Kanakamedala)దర్శకత్వం వహించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
