అదితి కేరాఫ్ ఓటీటీ
on Apr 17, 2021
`సమ్మోహనం`తో తెలుగువారిని సమ్మోహనపరిచిన నాయిక అదితి రావ్ హైదరీ. తెలుగు కంటే ముందు హిందీ, మలయాళం, తమిళ, మరాఠీ భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసిన అదితి.. ఇటీవల కాలంలో కేరాఫ్ ఓటీటీ అన్నట్లుగా ముందుకు సాగుతోంది. గత 9 నెలల కాలంలో ఆమె నటించిన నాలుగు చిత్రాలు ఓటీటీ బాట పట్టిన వైనం ఇందుకు నిదర్శనం.
గత ఏడాది జూలైలో మలయాళ చిత్రం `సూఫీయుమ్ సుజాతయుమ్`తో సుజాతగా పలకరించిన అదితి.. సెప్టెంబర్ లో తెలుగు చిత్రం `వి`లో సాహెబాగా సందడి చేసింది. ఈ రెండు సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ కావడం విశేషం. `సూఫీయుమ్ సుజాతయుమ్`తో నటిగా మంచి మార్కులు కొట్టేసిన అదితి.. `వి`తో మాత్రం నిరాశపరిచింది. ఇక ఈ ఫిబ్రవరి నెలాఖరులో హిందీ చిత్రం `ద గాళ్ ఆన్ ద ట్రైన్`లో నుస్రత్ జాన్ గా థ్రిల్ చేసిన అదితి.. ఈ శుక్రవారం (ఏప్రిల్ 16) హిందీ ఆంథాలజీ ఫిల్మ్ `అజీబ్ దస్తాన్స్`లో ప్రియా శర్మగా ఎంటర్ టైన్ చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి.
మొత్తమ్మీద.. తొమ్మిది నెలల కాలంలో మూడు వేర్వేరు భాషల్లో (మలయాళం, తెలుగు, హిందీ) నాలుగు ఓటీటీ మూవీస్ తో అదితి టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవడం విశేషం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
