ఔట్‌సైడర్‌కి అర్థం తెలియదన్న మిల్కీబ్యూటీ!
on Mar 6, 2023

ఇప్పుడు ఎక్కడ విన్నా ఔట్‌సైడర్లు, నెపోటిజం అనే మాటలు చాలా చాలా కామన్ అయిపోయాయి. కానీ తాను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అలాంటివి అసలు లేవని అన్నారు తమన్నా. అప్పట్లో తనకు తెలిసింది ఒక్కటే విషయమట. ఎలాగైనా సరే సినిమా స్టార్ కావాలని. అప్పట్లో ఇండస్ట్రీలో రెండు పదాలే ఫేమస్ అట. అందులో ఒకటి స్టార్లు, రెండోది ఫ్యాన్స్. అంతకు మించి ఇంకేం ఆలోచనలూ ఉండేవి కావట. తమన్నా తన కెరీర్ స్టార్టింగ్ గురించి నార్త్ మీడియాతో చాలా విషయాలే చెప్పుకొచ్చారు. ``చిన్నప్పటి నుంచీ నాకు ఫిల్మ్ స్టార్ కావాలని ఉండేది. నేను మా వాళ్లతో అదే చెప్పేదాన్ని. మాధురి దీక్షిత్, శ్రీదేవి, కరిష్మా కపూర్ నాకు ఇన్‌స్పిరేషన్. వాళ్లలాగానే డ్యాన్సులు చేసేదాన్ని. మా వాళ్ల బర్త్ డే పార్టీలు ఎక్కడున్నా నేను సోలో పెర్ఫార్మెన్స్ లు చేసేదాన్ని. తర్వాతి కాలంలో ఆడిషన్లకు వెళ్లినప్పుడు అదే నాకు ప్లస్ అయింది. భయం లేకుండా పెర్ఫార్మ్ చేయగలిగేదాన్ని`` అని అన్నారు.
చిన్నతనం నుంచీ తనను తల్లిదండ్రులు ప్రోత్సహించిన విధానం చాలా గొప్పదని అన్నారు. ``నా కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు 15 సంవత్సరాలు. అలాగని మా వాళ్లు నన్నెప్పుడూ కట్టడి చేయలేదు. చుట్టూ ఉన్నవారు ఎలాంటి విషయాలు మాట్లాడుతారో నాకు చెప్పేవారు. ప్రతిదీ నాతో డిస్కస్ చేసేవారు. నా దగ్గర ఏదీ దాచేవారు కాదు. అందుకే నేను ఎక్కడేం జరిగినా ఇంట్లో వాళ్లతో చాలా ఫ్రీగా చెప్పుకునేదాన్ని. డిస్కస్ చేసేదాన్ని. నా బోర్డ్ ఎగ్జామ్స్ సమయంలోనే, నాకు పెద్ద యాడ్ అవకాశం వచ్చింది. రెండిటినీ మేనేజ్ చేశాను. దేన్నీ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడే కాదు, జీవితంలో పెద్ద అవకాశం వచ్చిన ప్రతిసారీ నాకు అడ్డంకి వచ్చేది. అయినా నేను అడ్డంకి గురించి పట్టించుకునేదాన్ని కాదు. ఉపాయంగా దాన్ని దాటుకుని సక్సెస్ చూశాను. నా కోరిక బలంగా ఉన్నప్పుడు చిన్న చిన్న అడ్డంకులు నన్నేం చేస్తాయనే ఆత్మవిశ్వాసం ఉండేది నాకు. ఇవాళ్టికీ నన్ను అదే నడుపుతోంది. అంత చిన్న వయసులో అలాంటి నిర్ణయాలు ఏ పిచ్చితో తీసుకున్నానోనని సరదాగా అనుకుంటూ ఉంటాను. ఉద్దేశం మంచిదైనప్పుడు భగవంతుడు కూడా మంచే చేస్తాడనడానికి నేను ఉదాహరణ`` అని అన్నారు మిల్కీబ్యూటీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



