అనసూయను బాధపెట్టిన నాగబాబు!
on Sep 25, 2017

పెద్ద రాణీగారు మంచిది అంటే... చిన్న రాణీగారు మంచిది కాదనేగా అర్థం. ప్రస్తుతం యాంకర్ అనసూయ పరిస్థితి ఎలాగే తయారైంది. ఒకే బాధ్యతను ఇద్దరు వ్యక్తులు ఒకే చోట నిర్వర్తిస్తున్నప్పుడు... కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఎవరో ఒకరు ఎదుర్కోవాల్సి వస్తుంది. రీసెంట్ గా అనసూయ ఎదుర్కొంది. దానికి ఈ మధ్య విడుదలైన ఓ కామెడీ షో ప్రోమోనే సాక్ష్యం.
ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారయ్యే కామెడీ షో ప్రోమోలో నగిరి ఎమ్మెల్యే రోజాని.. మెగా బ్రదర్ నాగబాబు ‘కోహినూర్ వజ్రం’తో పోల్చాడు. అప్పుడు పక్కనే అనసూయ కూడా ఉంది. హర్ట్ అయ్యిందో ఏమో పాపం... కళ్లు తిరిగిపడియింది. నాగబాబే మళ్లీ ఆమెను పట్టుకొని జాగ్రత్తగా స్పృహలోకి తెచ్చారు.
అయిదు పదులకు దగ్గరవుతున్న రోజా... కోహినూర్ డైమండ్ అయితే... యువతరానికి ప్రతీకైన అనసూయ ఎవరు? అని సోషల్ మీడియాలో ఒకటే ప్రశ్నలు. ‘అనసూయ కళ్లు తిరిగి పడిపోడానికి కారణం నాగబాబు కామెంటే’ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఎంతపని చేశారండీ నాగబాబు... అసలే ఆవిడగారి పేరు అనసూయ. ఆ పేరులోనే అసూయ దాగుంది. మరి పడిపోక ఏం చేస్తుంది? చెప్పండి?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



