నటి కీర్తిరెడ్డి పుట్టింట విషాదం
on May 14, 2021

నటి కీర్తి రెడ్డి పుట్టింట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే కొద్దిసేపటికే ఆయన చివరి శ్వాస విడిచారు. ఆనంద్‌రెడ్డి నిజామాబాద్ మాజీ పార్లమెంటరీ సభ్యులు కేశ్‌పల్లి గంగారెడ్డి కుమారుడు. 2014లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బీజేపీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2018 ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రసమితిలో చేరారు.

ఆనంద్‌రెడ్డి ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన కీర్తి రెడ్డి నటిగా కొన్ని సినిమాలు చేశారు. వాటిలో పవన్ కల్యాణ్ జోడీగా నటించిన తొలిప్రేమ ఆమెకు మంచి పేరు తెచ్చింది. మహేశ్ సొంత సినిమా అర్జున్‌లో ఆయనకు అక్కగా నటించి మెప్పించారు. 2004లో హీరో సుమంత్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి దాంపత్యం ఎక్కువ రోజులు సాగలేదు. 2006లోనే విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమె 2014లో కార్తీక్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని బెంగళూరులో స్థిరపడ్డారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



