సుమన్ అరెస్ట్ కి అసలు కారణం తెలిసింది..ముఖ్యమంత్రి ఆర్డర్స్ తో ఒక కోటీశ్వరుడి కుట్ర
on Feb 6, 2025
తన అధ్బుతమైన నటనతో అశేష తెలుగు ప్రజల అభిమాన కథానాయకుడిగా మారిన హీరో సుమన్(Suman)ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా కూడా తన సత్తా చాటుతు వస్తున్నాడు. తెలుగు,తమిళ,మలయాళ భాషతో పాటు ఇతర భాషల్లో కలిపి సుమారు 700 చిత్రాలకి పైగానే చేసిన సుమన్ తన సినీ కెరీర్ ఉచ్చ దశలో ఉన్నప్పుడు నీలి చిత్రాల్లో నటిస్తున్నాడనే కేసులో చెన్నై లో అరెస్ట్ అయ్యి ఆరు నెలలపాటు జైలు జీవితాన్ని అనుభవించిన విషయం తెలిసిందే.
ఇప్పడు ఈ విషయంపై ప్రముఖ సీనియర్ నటీ జయశీల(Jaya Sheela)రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సుమన్ ని పోలీస్ ఆఫీసర్ అయిన నా భర్త చంద్రమే అరెస్ట్ చేసాడు.అప్పుడు నేను సుమన్ తో నైట్ పది గంటల దాకా షూటింగ్ లోనే ఉన్నాను.సుమన్ ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.తను అలాంటి వాడు కాదని చెప్పాను.ఆయనకూడా నా మాటకి ఏకీభవించాడు.కానీ పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి.ముఖ్యమంత్రి ఎంజీ రామ్ చంద్రన్ కూడా అరెస్ట్ చెయ్యమని చెప్పారు.సుమన్ ఫ్రెండ్ దివాకర్ కూతురుకి,తమిళనాడులోనే అత్యంత ధనవంతుడైన వడయార్ కూతురుకి మధ్య ఏదో ప్రాబ్లం ఉంది.
అందుకే దివాకర్ ఫ్రెండ్ సుమన్ కాబట్టి సుమన్ లాగా ఒక డూప్ ని పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసారు.ఆ తర్వాత సుమన్ ని కాపాడింది కూడా మా ఆయనే అని చెప్పుకొచ్చింది.ఇప్పడు ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
