Laila Trailer: పువ్వు లేదు, కాయ ఉన్నాయ్.. డబుల్ మీనింగ్ డైలాగ్ ల లైలా!
on Feb 6, 2025
విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'లైలా' (Laila). లైలా మరియు సోను మోడల్ గా రెండు విభిన్న కోణాలున్న పాత్రలలో విశ్వక్ సేన్ సందడి చేయనున్నాడు. లైలా రాం నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ కథానాయిక. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. (Laila Trailer)
నవ్వించడమే ప్రధానంగా లైలా సినిమాను రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. మొదట సోను మోడల్ గా విశ్వక్ కనిపించాడు. అయితే ఎమ్మెల్యే చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం సోను అంటూ.. అతన్ని చంపాలని పలువురు తిరుగుతుంటారు. వారి నుంచి తప్పించుకోవడం కోసం లేడీ గెటప్ వేసుకొని లైలా గా మారతాడు విశ్వక్. లైలా నిజంగానే అమ్మాయి అనుకొని, ప్రేమ పేరుతో మగవారు వెంటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో డైలాగ్ లతోనే నవ్వించాడు విశ్వక్. అయితే డబుల్ మీనింగ్ డైలాగ్ ల డోస్ కూడా ఎక్కువగానే ఉంది. "నీ ఛాతి చూశాక నా ఛాతి చపాతీ అయింది", "నీది పువ్వు లేదు.. కాయ ఉన్నాయ్", "కాయ లేదు, పండు ఉన్నాయ్.. పువ్వు లేదు, కాయ ఉన్నాయ్." వంటి డైలాగ్ లు ట్రైలర్ లో ఉన్నాయి.
మొదటి నుంచి సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ వస్తున్న విశ్వక్.. లైలాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
