బంగీ జంప్‌లో ప్రమాదం.. ‘బాహుబలి’ బ్యూటీ మృతి.. అసలేం జరిగింది?
on Feb 6, 2025
గత కొన్ని గంటలుగా ఈ వార్త మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఎవరీ ఐటమ్ గాళ్ అంటే.. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషనల్‌లో వచ్చిన టెంపర్ చిత్రంలోని ఐటమ్ సాంగ్‌లో తన అందచందాలతో, స్టెప్పులతో తొలిసారి కనువిందు చేసింది. ఆ తర్వాత బాహుబలిలోని మనోహరీ.. సాంగ్‌లోనూ తన నృత్య విన్యాసాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. అలాగే కిక్2, షేర్, ఊపిరి వంటి సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసింది. నోరా పుట్టినరోజు ఫిబ్రవరి 6. దానికి ఒకరోజు ముందే ఆమె ఒక ప్రమాదంలో మరణించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. బంగీ జంప్ చేస్తూ ప్రమాదవశాత్తూ కొన్ని అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పడిపోవడం వల్ల ఆమె మృతి చెందింది అనేది ఆ వార్త. దానికి ఒక వీడియోను కూడా జత చేసి పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలో ఉన్న యువతి నోరా కాదని, ఎవరో మార్ఫింగ్ చేశారని కొందరు నెటిజన్లు పదే పదే చెప్పారు. కానీ, దాన్ని కొందరు పట్టించుకోకుండా ఆ వీడియోను, న్యూస్‌ను షేర్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఆ న్యూస్ కాస్తా వైరల్ అయిపోయింది.
ఈ వార్తతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ ఉలిక్కి పడిరది. ఈ వార్తలో నిజం ఎంత వుందనేది తెలుసుకోవాలని ఆమె ఎకౌంట్‌కు వేల సంఖ్యలో మెసేజ్‌లు వెళ్లిపోయాయి. ఇది గమనించిన నోరా టీమ్ వెంటనే స్పందించింది. దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వీడియోలో ఉన్నది నోరా కాదని ఆమె టీమ్ స్పష్టం చేసింది. గురువారం ఆమె పుట్టినరోజు కావడంతో ప్రస్తుతం ఆ వేడుకల్లో తలమునకలై ఉంది నోరా ఫతేహి. ఆమె బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త ఫేక్ అని కన్‌ఫర్మ్ చేసుకున్నారందరూ. కెనడా దేశానికి చెందిన నోరా ఫతేహి బాలీవుడ్‌లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. హిందీ సినిమాలు, తెలుగు సినిమాలతో పాటు పలు భారతీయ భాషల్లోని సినిమాల్లో నటించిన నోరా.. తను ఇండియన్‌ని అనే ఫీలింగ్ కలుగుతోందని ఎంతో ఆనందంగా చెబుతోంది. ప్రస్తుతం నోరా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. వాటిలో కాంచన 4 కూడా ఉంది. తనకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
