ENGLISH | TELUGU  

మ‌న‌ద‌గ్గ‌ర మ‌హారాజ‌పురం ఉండ‌గా మాల్దీవుల‌కెందుకు దండ‌గ‌!

on Nov 25, 2020

 

లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చొని కూర్చొని విసుగెత్తిన‌ సెలబ్రిటీలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా విహారయాత్రకు వెళుతున్నారు. దాని కోసం త‌మ ఫేవ‌రేట్ ప్లేస్‌ను ఎంచుకుంటూ వ‌స్తున్నారు. మ‌హేశ్‌, తార‌క్ లాంటి కొంత‌మంది సెల‌బ్రిటీలు దుబాయ్‌ను త‌మ డెస్టినేష‌న్‌గా ఎంచుకొంటే, టాలీవుడ్‌-బాలీవుడ్ తేడా లేకుండా ఎక్కువ మంది సెలబ్రిటీలు మాల్దీవులనే ఎంచుకుంటున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, తాప్సీ, రకుల్ ప్రీత్ సింగ్, సమంతా అక్కినేని, మెహ్రీన్‌, దిశా ప‌టాని త‌దిత‌రులంతా మాల్దీవుల బీచ్‌ల‌లో విహ‌రిస్తూ, త‌మ అంద‌చందాల ప్ర‌ద‌ర్శ‌న‌ను ఫొటోలు, వీడియోలు రూపంలో షేర్ చేసుకుంటూ ఇంట‌ర్నెట్‌ను హీటెక్కిస్తున్నారు.

అయితే ఈ ధోరణిని అధిగమించి ఒక తార విదేశీ డెస్టినేష‌న్‌ను కాకుండా ద‌క్ష‌ణి భార‌త‌దేశంలోని ఓ అంద‌మైన ప్ర‌దేశానికి వెళ్లింది. అంతేనా.. 'ఇన్‌క్రెడిబుల్' ఇండియా అనే స్లోగ‌న్‌ను ప్ర‌చారం చేస్తోంది. ఆమె 'హార్ట్ ఎటాక్' హీరోయిన్ అదా శ‌ర్మ‌. ప్ర‌స్తుతం ఆమె తమిళనాడులోని మహారాజపురంలో పర్యటిస్తోంది. తన పర్యటన తాలూకు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అదా, ప‌రోక్షంగా మాల్దీవుల్లో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తూ, పిక్చ‌ర్స్‌ను పోస్ట్ చేస్తున్న సెల‌బ్రిటీల‌ను క‌వ్వించింది.

“Maharajapuram not Maldives  #incredibleindia #100YearsOfAdahSharma. Don’t ask howwww we reached here ! No one has ever shot here before and I was lucky to we went up here just for the drone shot …up up up the mountain,” అని ఆ వీడియోల‌కు క్యాప్ష‌న్ జోడించింది. అదీ విష‌యం.. దేశంలో ప్ర‌కృతి అందాల‌తో విరాజిల్లే అనేక బ్యూటిఫుల్ లొకేష‌న్స్ వ‌దిలిపెట్టి, పొలోమ‌ని ఫారిన్ డెస్టినేష‌న్స్‌కు విహార యాత్ర‌ల‌కు వెళ్తున్న సెల‌బ్రిటీల ద‌గ్గ‌ర దీనికి ఆన్స‌ర్ ఉందా?

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.