తాప్సికీ తప్పలేదు... మృగాళ్ల వేధింపులు
on Sep 19, 2016
.jpg)
రోడ్డుపై అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు.. మగాళ్ల చూపులు ఎక్కడెక్కడికో వెళ్లిపోతాయి.కాస్త సందు దొరికితే చాలు.. తాకడానికీ, ద్వందార్థాలతో రెచ్చిపోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వేధింపులు నిత్యం మహిళా సమాజం ఎదుర్కొంటున్నదే. తాప్సికీ ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయట. ఆమె నటించిన తాజా చిత్రం పింక్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో తాప్సి నటనకు మంచి మార్కులు పడ్డాయి. మహిళలపై జరుగుతున్న వేధింపుల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈసినిమాకీ , తన జీవితానికీ కొన్ని పోలికలున్నాయంటోంది తాప్సి. దిల్లీలో ఒంటరిగా రోడ్డుపైకి వెళ్లినప్పుడు చాలామంది మగాళ్లు తనని తినేసేలా చూశారని, తాకడానికి ప్రయత్నించారని, డబుల్ మీనిండ్ డైలాగులతో వేధించారని, అప్పట్లో వాళ్లపై తిరగబడలేకపోయానని చెబుతోంది తాప్సి. ఇలాంటి పరిస్థితులు ఏ ఆడపిల్లకూ ఎదురు కాకూడదని, ఒకవేళ ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే అక్కడికక్కడే బుద్ది చెప్పాలని హితవు పలికింది తాప్సి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



