Home

»

Latest News

TVK Vijay: విజయ్ సీఎం కాకపోతే జరిగేది ఇదే.. విశాల్ సంచలన పోస్ట్!

May 08, 2026

తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీలకు షాకిస్తూ.. విజయ్ దళపతి స్థాపించిన 'టీవీకే' (TVK) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 234 సీట్లకు గాను, 108 స్థానాల్లో విజయ్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. 118 మ్యాజిక్ ఫిగర్ కి కాస్త దూరంలో ఆగిపోయినప్పటికీ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని భావించారంతా. 

కానీ, థ్రిల్లర్ సినిమాలను తలపిస్తూ తమిళ్ పాలిటిక్స్ గంటకో ట్విస్ట్ ఇస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ ను సీఎం కుర్చీపై కుర్చోనివ్వకుండా చేయడం కోసం.. బద్ద శత్రువులైన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాల్ సంచలన ట్వీట్ చేశాడు.

ప్రభుత్వ ఏర్పాటులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై విశాల్ ఘాటుగా స్పందించాడు. అధికార పీఠంపై 'టీవీకే' కూర్చోకపోతే, రాష్ట్రానికి అది ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఒకవేళ డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే.. అది అత్యంత వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి విచిత్రమైన పొత్తులు సామాన్య ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని, ఓటరుగా తాను ఈ ప్రమాదకరమైన పరిస్థితిని ముందే ఊహిస్తున్నానని విశాల్ రాసుకొచ్చాడు.

సాధారణంగా తమిళ రాజకీయాల్లో డీఎంకే, ఏఐఏడీఎంకేలు బద్ధ శత్రువులుగా ఉంటాయి. అందుకే ఈ రెండు పార్టీలు కలిస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడతాయని విశాల్ అభిప్రాయపడ్డాడు.  విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మరి తమిళనాడు నూతన ప్రభుత్వ ఏర్పాటులో చివరికి ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com