Home

»

Latest News

Jr NTR: ఎన్టీఆర్ మాస్ జాతర.. తమన్ షేర్ చేసిన క్రేజీ పిక్ వెనుక అసలు గుట్టు ఇదేనా?

May 08, 2026

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ (Thaman) తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్ చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (Dragon) చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' (God Of War) చేయనున్నాడు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'డ్రాగన్' గ్లింప్స్ విడుదల కానుంది. అలాగే, 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశముంది. ఈ సినిమాలకు సంబంధించిన వార్తలు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. ఈ తరుణంలో తమన్ షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటో హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ గుబురు గడ్డం, కోర మీసం, నోట్లో టూత్ పిక్ తో అత్యంత పవర్‌ఫుల్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తమన్ ఈ ఫోటోను షేర్ చేస్తూ ఎమోజీలతో ఒక 'బాంబ్' హింట్ ఇచ్చాడు. దీంతో ఇది ప్రశాంత్ నీల్ సినిమాకి సంబందించిన బ్లాస్టింగ్ న్యూస్ కోసమా లేదా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమా అనే సస్పెన్స్ మొదలైంది.

ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే, అది నీల్ ప్రాజెక్ట్ లోదే అనిపిస్తోంది. దీంతో 'డ్రాగన్' గ్లింప్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని చెప్పడం కోసం తమన్ ఈ ట్వీట్ చేసుంటాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఈ ఫోటో విషయంలో మరో చర్చ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుండటంతో.. బిగ్ బ్లాస్ట్ కి రెడీగా ఉండమని ఫ్యాన్స్ కి తమన్ హింట్ ఇచ్చాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏదైనా తమన్ షేర్ చేసిన ఫొటోలో మాత్రం ఎన్టీఆర్ లుక్ వేరే లెవెల్ లో ఉంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com