Home

»

Latest News

ఘోర విషాదం: షూటింగ్ అయిపోగానే లెజండ్రీ కెమెరామెన్ మృతి: కారణం ఇదే!

Nov 10, 2026 5:58PM


మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజి కుమార్  కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో ఈ రోజు  తుదిశ్వాస విడిచారు. దీంతో అభిమానులతో పాటు ఎంటైర్ సౌత్ చిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది.


అలప్పుజలో దిలీప్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో షాజి కుమార్‌కి  ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అక్కడ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శనివారం సాయంత్రం అస్వస్థతకి గురయ్యారు. వెంటనే కొచ్చిలోని ఎర్నాకులం మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించడంతో ఆయన ఆరోగ్యం కొంతమేర కుదుటపడింది.

ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు కూడా మార్చారు. అయితే, సోమవారం రాత్రి సమయంలో అనుకోకుండా పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్య స్మిత, ఇద్దరు కుమారులు ఆర్యన్, సూర్ యన్ ఉన్నారు.


2001లో జయరామ్ హీరోగా నటించిన 'ఉత్తమన్' సినిమాతో స్వతంత్ర సినిమాటోగ్రాఫర్‌గా ప్రయాణం ప్రారంభించిన షాజి కుమార్, తన కెరీర్‌లో 50కి పైగా చిత్రాలకి పనిచేశారు. వెండితెర సెల్లాయిడ్ రోజుల నుంచి డిజిటల్ యుగంలోకి సినిమా మారుతున్న కాలంలో ఆయన తన కెమెరా పనితనంతో అద్భుతాలు సృష్టించారు. మోహన్‌లాల్ నటించిన బాక్సాఫీస్ సెన్సేషన్ 'పులిమురుగన్', 'నారన్', 'ఒడియన్', 'తమరుమ్', అలాగే 'పోక్కిరి రాజా', 'మధుర రాజా', 'రామలీల', 'పతొన్పతం  వంటి ఎన్నో భారీ చిత్రాలకి  ఫోటో గ్రఫీ అందించారు. 

ఇది కూడా చదవండి: హనుమాన్ అంశ్ ఓటిటి డేట్ ఇదే: ఆ రోజు వాళ్ళని ఆపలేం! 

కేవలం మలయాళంలోనే కాకుండా తమిళంలో  'మంబాట్టియాన్', 'సాహసం' వంటి చిత్రాలతోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాటోగ్రఫీ అందించిన మోహన్‌లాల్ - తరుణ్ మూర్తి కాంబినేషన్ మూవీ 'అతిమనోహరం' డిసెంబర్ 24, న  విడుదలకి సిద్ధమవుతోంది.

అలాంటిది కేవలం కొన్ని వారాల ముందు ఆయన కన్నుమూయడం విశేషం. అలాగే సురేశ్ గోపి నటిస్తున్న 'ఒట్టకొంబన్' సినిమాకు కూడా ఆయన పనిచేశారు. ఇటు అగ్ర దర్శకులు జోషి, షాజి కైలాస్, వినాయన్, వైశాఖ్‌లతో పాటు కొత్త తరపు దర్శకులతోనూ ఎంతో సాన్నిహిత్యంగా మెలిగారు. ఆయన వయసు కేవలం 57 సంవత్సరాలు కావడం గమనార్హం.

 

మీకు నచ్చవచ్చు: అన్నా లెజినోవా ఆస్తుల విలువ ఇదే!
మీకు నచ్చవచ్చు: స్టార్ హీరోయిన్ విడాకుల కహానీ ఇదే!

 

[Malayalam Cinematographer Shaji Kumar Passes Away, Shaji Kumar, Malayalam cinematographer, Shaji Kumar passes away, Shaji Kumar death,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com