Home

»

Latest News

హనుమాన్ అంశ్ ఓటిటి డేట్ ఇదే: ఆ రోజు వాళ్ళని ఆపలేం! 

Nov 10, 2026 5:39PM

కంటెంట్ ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద  కోట్ల రూపాయల కనక వర్షం గ్యారంటీ అని హనుమంతుడు సాక్షిగా ‘హనుమాన్ అంశ్’ నిరూపించిన విషయం తెలిసిందే. తెలుగు డబ్బింగ్ బాగానే ఆడేది గాని రిలీజ్ లేట్ అయ్యిందనే మాటలు సినీ ప్రేమికులు వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే హిందీ ఒరిజినల్ వెర్షన్ చాలా మంది చూసేసారు.


డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. నవంబర్ 27న ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్ (SonyLIV) ద్వారా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. మరి నవంబర్ 27 న రామ, హనుమాన్ భక్తులు, సినీ ప్రియుల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 

 2 కోట్ల అతి చిన్న బడ్జెట్‌తో తెరకెక్కడం విశేషం. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా, స్టార్ హీరోలు లేకపోయినా  452.86 కోట్ల భారీ వసూళ్లని  సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. తద్వారా 2026 సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 4వ స్థానంలో నిలిచిన ట్రాక్ రికార్డుని కూడా మోస్తూనే ఉంది.

 

ఇది కూడా చదవండి: విడాకులకి సిద్దమైన స్టార్ హీరోయిన్: అసలేం జరుగుతుంది!

లక్ష్మీనారాయణ అనే యువకుడు తన తల్లిని కోల్పోయిన తర్వాత జీవితం, దేవుడు మరియు మరణం గురించిన నిజాలను వెతుకుతూ సాగే సున్నితమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. శోభినావ్ సత్యా, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించగా.. అనిల్ రస్తోగి, పూర్ణిమ తివారీ, సుగంధ మల్హోత్రా, భగవందాస్ పటేల్, నేహా పరంజ్పే తదితరులు కీలక పాత్రలు పోషించారు.

విశాల్ చతుర్వేది, అనుప్రియ నగర్, రాగిణి సోనా, నమ్రత జి సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా (Neem Karoli Baba) జీవితం ఆధారంగా తెరకెక్కింది.

 

మీకు నచ్చవచ్చు: స్టార్ హీరోయిన్ విడాకులు!
మీకు నచ్చవచ్చు: సబ్బుల వ్యాపారానికి, సినిమాకి ఉన్న సంబంధం ఏంటి!

 

[Hanuman Ansh Ott Release Date, Hanuman Ansh OTT release date, SonyLIV streaming, Neem Karoli Baba biopic, Hanuman Ansh box office collection, Vishal Chaturvedi movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com