ఆసుపత్రి పాలైన పృథ్వీరాజ్.. లైలా ఎఫెక్టేనా..?
on Feb 11, 2025
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ఆసుపత్రి పాలయ్యారు. హై బీపీతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పృథ్వీ చేరారు. పరీక్షించిన వైద్యులు.. విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. (Prudhvi Raj)
రెండు రోజులుగా పృథ్వీరాజ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఇటీవల జరిగిన 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడుతూ.. 150 మేకలలో 11 మేకలే మిగిలాయి అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇవి పరోక్షంగా వైసీపీ సీట్లపై చేసిన కామెంట్స్ లా ఉండటంతో.. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో 'బాయ్ కాట్ లైలా' అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై స్పందించిన హీరో విశ్వక్ సేన్.. ఎవరో ఒకరు చేసిన కామెంట్స్ కి ఇలా సినిమాకి బాయ్ కాట్ చేస్తామనడం కరెక్ట్ కాదు అన్నాడు. మరోవైపు పృథ్వీరాజ్ సైతం, తాను ఏ పార్టీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పాడు. ఇలా ఒక వైపు ఈ వివాదం నడుస్తుండగానే పృథ్వీ అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పృథ్వీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
