పోసాని కృష్ణమురళికి వేధింపులు..పోలీస్ కంప్లైంట్..!
on May 28, 2016

కేవలం మహిళలకు మాత్రమే కాదు. పురుషులకు కూడా సెల్ ఫోన్లో వేధింపులు మొదలయ్యాయి. అది కూడా సినిమా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లకే ఈ వేధింపులు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ ముఖస్తుతి చేయకుండా, ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతారనే పేరు పోసానికి ఉంది. ఇదే కాక ఆయనకు సాయం చేసే మంచి మనసుందని కూడా చాలా మంది అంటుంటారు. నిస్సహాయులకు, నిజంగా హెల్ప్ అవసరమైన వారికి ఆయన సహాయం అందిస్తారు. రీసెంట్ గా యూసుఫ్ గూడకు చెందిన నరేష్ అనే ఒక వ్యక్తి తనకు సాయం చేయాలని పోసానిని రిక్వెస్ట్ చేశాడట. అయితే అతను తాగుడుకు బానిస అని, ఈజీ మనీకోసం అలవాటు పడ్డాడని తెలుసుకున్న పోసాని, సాయం చేయనని ఖరాఖండిగా చెప్పేశారంట. ఇక ఆ తర్వాతి నుంచి అతను పోసాని మొబైల్ కు ఆయన్ని తిడుతూ మెసేజ్ లు పంపడం మొదలెట్టాడు. వార్నింగ్ ఇచ్చినా వినకపోయేసరికి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోసాని. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



