కేసీఆర్‌కు రూ. 10 లక్షలు అందజేసిన నితిన్
on Mar 24, 2020

ప్రకటించినట్లుగానే కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు విరాళం అందజేశాడు హీరో నితిన్. మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిసిన ఆయన రూ. 10 లక్షల చెక్కును అందజేశాడు. ఈ సందర్భంగా నితిన్‌ను అభినందించిన కేసీఆర్ ఆయనను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. నితిన్ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి నిరోధ కార్యక్రమాల విషయంలో సీఎం కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడాci. కేసీఆర్ గారి స్ఫూర్తితో ప్రజలందరూ లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని పిలుపునిచ్చాci. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉన్నందున వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గారిని కలుసుకొని, ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి తాను ప్రకటించిన రూ. 10 లక్షలను అందజేస్తానని నితిన్ తెలిపాడు. సినిమాల విషయానికొస్తే నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



