కరోనా నిరోధం నిమిత్తం హీరో నితిన్ రూ. 20 లక్షల విరాళం
on Mar 23, 2020

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తన వంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నారు. కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ప్రశంసించిన ఆయన, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో 10 లక్షల రూపాయల విరాళాన్ని నితిన్ ప్రకటించారు. మార్చి 31వ తేదీ వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలనీ, అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి, కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో పాలు పంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో కానీ, మరేదైనా విపత్తుల సమయంలో కానీ తక్షణం స్పందించి, తన వంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే నితిన్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత విపత్కర పరిస్థితిని మనో ధైర్యంతో ఎదుర్కోవాలనీ, అనవసర భయాందోళనలకు గురి కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రకటించే మార్గదర్శకాలను పాటించాలనీ ప్రజలను కోరారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే మూవీని చేస్తున్నారు. ఆయన జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



