నిరాడంబరంగా జరిగిన నిఖిల్ పెళ్లి
on May 13, 2020
హీరో నిఖిల్ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్విచెప్పి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాడు. గురువారం తన ప్రేయసి పల్లవి వర్మ మెడలో మూడు ముళ్లు వేశాడు. షామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 6:31 గంటలకు నిరాడంబరంగా పెళ్లి వేడుక జరిగింది. ఒకవైపు మేళతాళాలు మోగుతుండగా.. ఎరుపు, నారింజ రంగు కలనేత పట్టుచీరలో మెరిసిపోతున్న పల్లవి మెడలో, లేత నారింజ రంగు షేర్వాణీ ధరించిన నిఖిల్ మూడు ముళ్లు వేశాడు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు కొద్దిమంది పాల్గొన్నారు. టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన నిఖిల్ ఓ ఇంటివాడు కావడంతో తోటి హీరోలు, ఇతర నటులు అతడిని సోషల్ మీడియా ద్వారా అభినందనల్లో ముంచెత్తారు.
అంతకు ముందు బుధవారం రాత్రి నిఖిల్ ఇంట పెళ్లికొడుకు వేడుక, పల్లవి ఇంట పెళ్లికూతురు వేడుక జరిగాయి. వీటికి సంబంధించిన ఫొటోలను మీడియాకు పంపారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
