నారా రోహిత్‌కి పితృ వియోగం!
on Nov 16, 2024
టాలీవుడ్‌లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న హీరో నారా రోహిత్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్. నారా రామ్మూర్తి నాయుడు గత కొంత కాలంగా అస్వస్థతతో ఉన్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎఐజి హాస్పిటల్‌లో చేర్పించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నారా రామ్మూర్తి నాయుడుకి ఇద్దరు కుమారులు ఒకరు నారా రోహిత్ కాగా, మరొకరు నారా గిరీష్. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఎఐజి హాస్పిటల్‌కు తరలి వెళుతున్నారు. నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



