ఫిష్ వెంకట్ పరిస్థితి మరింత విషమం!
on Jul 9, 2025
టాలీవుడ్‌లో కామెడీ విలన్‌గా అనేక సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసిన ఫిష్ వెంకట్ గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో వెంకట్‌ను ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. వారి ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో చికిత్స కోసం దాతల సహాయాన్ని అర్థించారు. గత కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్న వెంకట్‌ను మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న కొందరు దాతలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. వారి సాయంతోనే తన తండ్రికి చికిత్స జరుగుతోందని ఫిష్ వెంకట్ కుమార్తె తెలిపారు. ప్రస్తుతం వెంకట్‌ను ఐసియులో ఉంచి చికిత్స చేస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారని ఆమె తెలిపారు. కిడ్నీ, లివర్‌తోపాటు శరీరమంతా బ్లడ్ ఇన్‌ఫెక్షన్‌కి గురి కావడంతో వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ అయిందని ఆమె తెలియజేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



