రొమాంటిక్ హీరోగా చేయడం చాలా కష్టం...నేనే లాస్ట్ జనరేషన్ కావొచ్చు
on May 31, 2023
ఒక మర్డర్ చుట్టూ ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతాయి అనే ఎన్నో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ అనేవి "చక్రవ్యూహం" మూవీలో ఉంటాయి అని చెప్పారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్. జూన్ 2 న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా అజయ్ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పారు. "ఇప్పటి వరకు నేను చాలా పోలీస్ క్యారెక్టర్స్ చేసాను. కానీ ఇక ముందర ఈ పోలీస్ రోల్స్ చేయకూడదు అని అనుకున్నాను...కానీ ఈ చక్రవ్యూహం మూవీ డైరెక్టర్ మధు వచ్చి కథ చెప్పడంతో స్క్రీన్ ప్లే కూడా బాగుండేసరికి నేను ఒప్పుకున్నాను. ఈ కథ విన్నాక చాలా ఎంగేజింగ్ గా అనిపించి ఇష్టపడి చేసాను." అని చెప్పాడు. "పోలీస్ రోల్స్ లోనే కాకుండా ఒక రొమాంటిక్ హీరోగా చూసే అవకాశం ఉందా" అని యాంకర్ అడిగేసరికి "రొమాంటిక్ హీరోగా చేయడానికి చాలా లేట్ ఐపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నాను. ఇందులోనే డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ ఉండాలి. గ్రే షేడ్స్ ఉన్నవి చేయాలి..అంటే కొన్ని రోల్స్ నెగటివ్ కానీ పాజిటివ్ ఉంటాయి. వాటి మధ్య చిన్న షేడ్ లో గ్రే రోల్స్ ఉంటాయి. విక్రమార్కుడు, ఇష్క్, జనతా గారేజ్, ఆర్య 2 , రీసెంట్ గా విరూపాక్షలో ఇలాంటి రోల్స్ రావడం చాలా లక్కీ..డ్రీంరోల్స్ అంటూ ఏమీ లేవు. కానీ ఛాలెంజింగ్ రోల్స్ చేయాలి.
నాకు కొత్తవాళ్లు వచ్చారా పాత వాళ్ళు వచ్చారా అనేది లేకుండా. ఎవరితోనైనా చేస్తాను. ఎందుకంటే ఒకరికి ఒకరం సపోర్ట్ అంతే. హీరో, హీరోయిన్, ఫాదర్, మదర్ తర్వాత కచ్చితంగా ఒక పోలీస్ ఉంటాడు. రొమాంటిక్ హీరో రోల్స్ చేయడం చాలా కష్టం.. ఇలాంటి కాప్ చేయడం చాల థ్రిల్లింగ్ గా ఉంటుంది." అని చెప్పాడు.."మీకు ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి అని అడిగేసరికి "రీసెంట్ గా ఒక చోట ఒక పెద్దాయన నన్ను చూసారు..ఈ కాలంలో ఇన్ని ఎక్కువ క్యారెక్టర్స్ చేసింది మీరే .. లాస్ట్ జనరేషన్ మీరే కావొచ్చు అన్నారు అదే నాకు పెద్ద కాంప్లిమెంట్ లా అనిపించింది...ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఈ 22 ఏళ్ళల్లో 200 క్యారక్టర్ రోల్స్ చేసాను. ఇలా ఇన్ని ఫిలిమ్స్ చేసేవాళ్ళు ఇంకెవరైనా ఉంటారా అనిపించింది. ఎందుకంటే ఫిలిమ్స్ తగ్గిపోయాయి. క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ తగ్గిపోయాయి. వేరే వేరే ప్లాట్ఫార్మ్స్ వచ్చాయి. కానీ నేను ఇంకా బిజీగా ఉన్నాను అంటే అది ఆడియన్స్ బ్లెస్సింగ్ మాత్రమే. ఇంకా మూవీస్ కొన్ని చేస్తున్నాను. కన్నడలో ఒకటి చేస్తున్న, తమిళ్ లో రెండు చేస్తున్నా..అజిత్ గారితో తెగింపు మూవీలో చేసాను. దానికి మంచి పేరొచ్చింది. అప్పుడు తెలిసింది లాంగ్వేజ్ తెలీకుండా వెళ్లి చేయడం ఎంత కష్టమో అని. జయం రవి గారితో చేస్తున్నాను. అది చాలా ఇంటరెస్టింగ్ రోల్..పుష్ప 2 కోసం చూస్తున్నాను ఎప్పుడెప్పుడు సెట్ కి వెల్దామా అని" చూస్తున్నానంటూ చెప్పారు అజయ్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
