
సినీ ఇండస్ట్రీలో హిట్ అనేది ఎంత గొప్పదంటే హిట్ ని అందుకున్న వాళ్ళ రూపురేఖలు కొత్తగా కనిపించడంతో పాటు వాళ్ళ రెమ్యునరేషన్ స్టేటస్ కూడా పెరిగిపోతుంది. సినీ ఇండస్ట్రీ పుట్టిన దగ్గరనుంచి అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
ఇప్పుడు మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) తాజా ఉదాహరణ. రవితేజ తో కలిసి 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీకి తొలి ప్రయత్నంలో విజయం దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన 'కింగ్‌డమ్', 'ఆంధ్ర కింగ్ తాలూకా' వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే, వరుస పరాజయాలు ఎదురైనా దర్శకులు, నిర్మాతలు ఆమెపై నమ్మకాన్ని కోల్పోలేదు. దీనికి కారణం ఆమె నటన, అందం, గ్లామర్ పరంగా ఎలాంటి కండిషన్లు పెట్టకుండా వంద శాతం కష్టపడే మనస్తత్వం.
Also read: పొలిమేర 3 లో ఒకప్పటి అగ్ర హీరో.. బాక్స్ ఆఫీస్ బద్దలు!
ఎట్టకేలకు అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో భాగ్యశ్రీ బోర్సే జాతకం పూర్తిగా మారిపోయింది. ఈ చిత్రంలో 'భారతి'గా ఆమె చూపిన అద్భుతమైన నటనకి ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ భారీ సక్సెస్ జోష్‌తో ఆమె తన పారితోషికాన్ని కూడా ఊహించని విధంగా పెంచేసింది. భాగ్యశ్రీ తన కెరీర్ ప్రారంభంలో మొదటి సినిమాకి అందుకున్న పారితోషికం 30 లక్షలు. అయితే, క్రమంగా క్రేజ్ తెచ్చుకుంటూ ఇటీవలి 'లెనిన్' సినిమా సమయానికి ఆమె 1.5 కోట్లు (కోటిన్నర) వసూలు చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు 'లెనిన్' ఇచ్చిన బ్లాక్‌బస్టర్ విజయంతో, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతున్న తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఆమె ఏకంగా 2 కోట్ల మార్కును దాటేసిందని సమాచారం. కొన్ని లీడ్ ప్రాజెక్ట్‌ల కోసం ఆమె 2.5 కోట్ల నుండి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని టాక్ నడుస్తోంది.






