నిఖిల్ మూవీ షూటింగ్ లో ఘోర ప్రమాదం..తీవ్ర గాయాలు
on Jun 11, 2025
నిఖిల్(Nihil)అప్ కమింగ్ మూవీస్ లో 'స్వయంభు'(Swayambhu)తో పాటు ది ఇండియా' హౌస్ '(The Indian House)కూడా ఒకటి. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ కేర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్ నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా రామ్ వంశీ కృష్ణ(Ram vamsi Krishna)దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్(Hyderabad)దగ్గరలోని శంషాబాద్(Saamshabad)లో జరుగుతుంది. సముద్రానికి సంబంధించిన అట్మాస్పియర్ కోసం భారీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. కానీ అనుకోకుండా వాటర్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో లోకేషన్ మొత్తం వరదతో నిండిపోవడంతో అసిస్టెంట్ కెమెరామెన్ కి తీవ్ర గాయాలయ్యాయి.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండియాకి స్వాతంత్రం రాకముందు లండన్ లోని ఇండియా హౌస్ నేపధ్యంలో జరిగే లవ్ అండ్ విప్లవం నేపధ్యంలో ఈ చిత్ర కథ తెరకెక్కుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



