అభినేత్రి టీజర్ టాక్ : తమన్నా మిస్సింగ్..!
on Jun 3, 2016
టీజర్ అంటే ఏంటి..? మూవీని దేన్ని బేస్ చేసుకుని తీస్తున్నారో, అది చూపించి ఆడియన్స్ లో కొత్త ఆసక్తిని కలిగించేదే టీజర్. కానీ అభినేత్రి టీం మాత్రం, దీనికి మీనింగ్ మార్చేశారు. మొదటి నుంచీ తమన్నా సినిమాగా, ఆమె చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీగా చూపిస్తూ వచ్చిన మూవీ టీం, టీజర్లో మాత్రం తమన్నా ఊసే లేకుండా డిజైన్ చేశారు. కోన సార్ సాయంత్రం టీజర్ వస్తోంది చూసుకోండి అనగానే, మిల్కీని ఏ రేంజ్ హర్రర్ లో చూపించి భయపెడతాడో అని ఆమె ఫ్యాన్స్ అందరూ ఎదురుచూశారు. తీరా చూస్తే, సింపుల్ గా ఒక సాంగ్, ఆ సాంగ్ లో ప్రభుదేవా డ్యాన్స్, పక్కన కూర్చుని చూస్తున్న అమీ జాక్సన్. దీన్నే టీజర్ గా రిలీజ్ చేశారు. సినీజనాలంతా టీజర్ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైందని క్లియర్ గా చేప్పేస్తున్నారు. దాదాపు 74 సెకన్ల పాటు ఉన్న టీజర్లో, 19 సెకన్ల పాటు కోన గారు తన లోగోను చూపించడానికే కేటాయించేశాడు. ఇక మరో 10 సెకన్ల పాటు ప్రొడక్షన్ పార్టనర్స్ ను అందర్నీ చూపించుకుంటూ వచ్చాడు. సరే తర్వాతైనా సినిమా కాన్సెప్ట్ ను రివీల్ చేస్తాడు కదా అని చూస్తుంటే, ఒక్కసారిగా ప్రభుదేవా తెరపైకి వచ్చి తనకు అలవాటైన స్టెప్పులు వేసుకుంటూ వెళ్లిపోయాడు. మధ్యలో అమీ జాక్సన్ ను చూపించారనుకోండి..అయితే ఎక్కడా మన మిల్కీ పాప మాత్రం కనబడలేదు. కేవలం ప్రభుదేవా బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ అంటూ బిల్డప్ కోసం మాత్రమే ఈ టీజర్ ఉపయోగపడింది. మరి ఇంకో టీజర్ ఏదైనా రిలీజ్ చేసి, తమన్నా లుక్ ను రివీల్ చేస్తారేమో చూడాలి.