Home

»

Latest News

ధృవ కోసం చెర్రీ మీసకట్టు చూశారా..?

Jun 03, 2016

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తర్వాతి సినిమా గురించి మెగాభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికీ షూటింగ్ స్టార్ట్ కాకపోవడం వాళ్లను నిరుత్సాహపరుస్తూ వస్తోంది. లేటెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే, చరణ్ ధృవ షూటింగ్ రేపటి నుంచే మొదలుకాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకు సినిమాను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు నిర్మాత అల్లు అరవింద్. సినిమాలో హీరో పాత్ర పోలీస్ కావడంతో, రోల్ కు తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి టైం తీసుకున్నాడు చెర్రీ. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చెర్రీ లేటెస్ట్ ఫోటో చూస్తే, బాడీ కోసం బాగానే కసరత్తు చేసినట్టు కనిపిస్తున్నాడు. మీసకట్టు, బ్లాక్ గాగుల్స్ తో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు చరణ్. ధృవలో కూడా ఇదే లుక్ తో కనిపిస్తాడని సమాచారం. సినిమాలో తన పాత్రకోసం, చెర్రీ పూర్తి వెజిటేరియన్ గా మారడంతో పాటు, వర్కవుట్స్ లెవల్ ను పెంచుకుంటూ వెళ్లాడు. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. చరణ్ ఇప్పటికైనా షూట్ మొదలెడుతున్నాడని ఫుల్ ఖుష్ అవుతున్నారు మెగాఫ్యాన్స్.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com