రామ్‌చరణ్ ఇంటికి వచ్చిన ఆమిర్ ఖాన్
on Jun 28, 2022
కొన్నాళ్లుగా బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు తరచూ కలుసుకుంటున్నారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, కొత్త క్షణాలను జ్ఞాపకాలుగా మిగుల్చుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తెలుగు స్టార్లను కలవడానికి ఉత్సాహం చూపుతుంటారు. లేటెస్ట్గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ హైదరాబాద్‌లో రామ్‌చరణ్ ఇంటికి వచ్చి సందడి చేశాడు.
ఈ సందర్భంగా ఆమిర్‌తో చరణ్, ఉపాసన దంపతులు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిక్చర్లో ఆమిర్, చరణ్ మధ్యలో తన పెట్ డాగ్‌ను పట్టుకొని నిల్చొని ఉంది ఉపాసన. బ్లాక్ టీ షర్ట్, ప్యాంట్, పింక్ జాకెట్ ధరించిన ఆమిర్ భుజాన బ్యాగ్ కూడా ఉంది. ఆమిర్ లేటెస్ట్ ఫిల్మ్ 'లాల్ సింగ్ చడ్ఢా' ఆగస్ట్ 11న విడుదలకు రెడీ అవుతోంది. ఈ మూవీలో మన హీరో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించాడు.