
ఓం, ఆకాశంలో ఒక తార, ENE రిపీట్ తో సినీ ప్రేమికులు ఇప్పుడు 'జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే అంటు మాస్ట్రో ఇళయరాజా సాంగ్ పాడుకుంటూ ఉన్నారు. పైపెచ్చు క్లైమెట్ కూడా ఆహ్లాదకరంగా ఉంది. ఇక వాళ్ళని ఆపడం ఎవరితరం చెప్పండి మరి. కానీ అభిమానుల్లో ఎవరు విజేతగా నిలుస్తారు. కలెక్షన్స్ ని ఎవరు ఎక్కువగా కొల్లగొడతారు. దీంతో ఎవరి సినిమాపై ప్రభావం చూపిస్తుందని..
విశేషమేమిటంటే ఈ మూడు సినిమాలకి ప్రేక్షకుల, విమర్శకుల నుండి పాజిటివ్ టాక్ లభిస్తోంది.కలెక్షన్ల గణాంకాలను పరిశీలిస్తే, నవంబర్ 19న ఒకరోజు ముందే విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 1,681 షోలలో ప్రదర్శితమై ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 11.30 కోట్ల గ్రాస్ వసూళ్లతో విశ్వక్ సేన్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే 6.00 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. రెండో రోజు మధ్యాహ్నం సమయానికే ₹89 లక్షల నెట్ వసూలు చేసి, మొత్తం 6.74 కోట్ల ఇండియా నెట్ మార్కును దాటింది. శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే అప్పుడే 99,594 టికెట్లు అమ్ముడై ₹1.57 కోట్లు వసూలు చేయడం ఈ మూవీ జోరుకి నిదర్శనం.
.webp)
మరోవైపు ఈ రోజు విడుదలైన 'ఓం: ఆపరేషన్ మోల్' పాన్-ఇండియా స్థాయిలో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా 3,201 షోలలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం, మొదటి రోజు మధ్యాహ్నం సమయానికే6.61 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 7 కోట్ల గ్రాస్ మార్కును దాటి, ధనుష్ గత చిత్రాలైన 'రాయన్' (6.15 కోట్లు), 'కెప్టెన్ మిల్లర్' (3.87 కోట్లు) రికార్డులను అధిగమించింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో తమిళ వెర్షన్ 75 శాతం వాటా కలిగి ఉండగా, తెలుగు వెర్షన్ 24 శాతం వాటాతో గట్టి పోటీనిస్తోంది. మమ్ముట్టి క్రేజ్ వల్ల కేరళలో కూడా 1.21 కోట్ల అడ్వాన్స్ గ్రాస్ నమోదైంది.
ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!
ఇక తండ్రి మమ్ముట్టి సినిమాతోనే పోటీ పడుతూ నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన దుల్కర్ సల్మాన్ చిత్రం 'ఆకాశంలో ఒక తార' క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మొదటి రోజు 627 షోలలో ప్రదర్శితమవుతూ, మధ్యాహ్నం సమయానికి 56 లక్షల నెట్ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 67,066 టికెట్లు అమ్ముడై 1.06 కోట్ల గ్రాస్ సాధించింది.
.webp)
మొత్తంగా చూస్తే, బాక్సాఫీస్ వద్ద ఈ మూడు సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అండతో 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' మొదటి స్థానంలో కొనసాగుతుండగా, మాస్ మరియు థ్రిల్లర్ ప్రియుల ఆదరణతో 'ఓం' గట్టి పోటీనిస్తోంది. 'ఆకాశంలో ఒక తార' మల్టీప్లెక్స్, క్లాస్ ప్రేక్షకుల మద్దతుతో నిలకడగా వసూళ్లు రాబడుతోంది.
.webp)
మూడు సినిమాలకూ పాజిటివ్ టాక్ ఉండటంతో, ఈ వీకెండ్లో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మూడు చిత్రాలు మంచి వసూళ్లు రాబడతాయని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే ఎంతకైనా తెగించి(టైం మేనేజ్ మెంట్) ప్రేక్షకుడు సినిమా చూస్తాడు. అది అతను అనాదిగా పెట్టుకున్న మతవిశ్వాసం
మీకు నచ్చవచ్చు:ENE రిపీట్ మూవీ రివ్యూ!
మీకు నచ్చవచ్చు: ఓం మూవీ రివ్యూ
[Aakasamlo Oka Tara, Om, Ene repeat, Dulqer, Dhanush, Mamootty]





