Home

»

Latest News

సమంతకు బాబు పుట్టాడు.. పేరు కూడా రివీల్‌ చేశారు.!

Nov 20, 2026 1:22PM

స్టార్‌ హీరోయిన్‌ సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. భర్త రాజ్‌ నిడిమోరుతో కలిసి తమకు కుమారుడు పుట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు.. బాబుకు పెట్టిన పేరును కూడా ప్రకటించారు.

నవంబర్‌ 19న సమంత మగబిడ్డకు జన్మనివ్వగా.. నవంబర్‌ 20న ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తమ బాబుకు దేవ్‌ నిడిమోరు (Dev Nidimoru) అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. చిన్నారి తన వేలిని పట్టుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ఇది తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణమని పేర్కొన్నారు.

గత ఏడాది డిసెంబర్‌ 1న సమంత, రాజ్‌ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌లో తాను తల్లి కాబోతున్న విషయాన్ని సమంత వెల్లడించారు. అప్పటి నుంచి తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ వచ్చారు.

ఇటీవలే బిడ్డ రాకకు ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇరు కుటుంబాల సభ్యులు కలిసి సమంతకు ఆశీస్సులు అందించారు. ఇక ఇప్పుడు బాబు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఈ శుభవార్తతో సోషల్‌ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సమంత షేర్‌ చేసిన బాబు తొలి ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

 

 

 

[Samantha Ruth Prabhu, Baby Boy, Dev Nidimoru, Raj Nidimoru]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com