అ..ఆ కు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది..!
on May 25, 2016

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా తెరకెక్కిన సినిమా అ..ఆ. జూన్ 2న రాబోతున్న ఈ సినిమా సెన్సార్ ముగిసింది. సింగిల్ కట్ కూడా లేకుండా క్లీన్ యు సర్టిఫికెట్ ను పొందిందీ ఫ్యామిలీ మూవీ. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలన్నీ కుటుంబంతో సహా చూడదగ్గ క్లీన్ సినిమాలే అయి ఉంటాయి. అందుకే ఆయన సినిమాలకు మ్యాగ్జిమం యు సర్టిఫికెట్ వస్తుంటుంది. క్లీన్ ఫ్యామిలీ కామెడీ, మంచి సంభాషణలు త్రివిక్రమ్ మార్క్ గా కనిపిస్తాయి. ఆడియో ఫంక్షన్, మూవీ ట్రైలర్ చూసినప్పుడే సినిమా ఎలా ఉండబోతుందో ఒక అవగాహనకు వచ్చేశారు జనాలు. ఈ సమ్మర్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు లేని లోటును తీరుస్తామని త్రివిక్రమ్ అండ్ కో చెబుతున్నారు. మొత్తం కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూడొచ్చని, వినోదం కన్ఫామ్ అని అంటున్నారు. అయితే ఇప్పటికే బ్రహ్మోత్సవం లాంటి ఫ్యామిలీ డ్రామా మూవీ వచ్చి దెబ్బకొట్టిన నేపథ్యంలో, ప్రేక్షకులు అ..ఆ ను ఎలా ఆదరించబోతున్నారో అన్నది ఆసక్తికరం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



